కాజల్ “సత్యభామ” ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

కాజల్ “సత్యభామ” ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

Published on May 20, 2024 9:00 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీ సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాని మే 17, 2024న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ తర్వాత మే 31, 2024కి వాయిదా పడింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా, సత్యభామ థియేట్రికల్ ట్రైలర్‌ను మే 24, 2024న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను ఔరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క కథా రచయితగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు