సీత పాత్ర నాకెంతో స్పెషల్ – కాజల్ అగర్వాల్

Published on May 21, 2019 1:02 am IST

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న సినిమా ‘సీత’. మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం. కాగా ఈ రోజు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుపుకుంది. ఈ ఈవెంట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

కాగా ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది.. ఈ పాత్రకు నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ తేజ గారికి చాల థాంక్స్.. ఆయనతో పనిచేయడం ఎప్పుడు కొత్తగానే ఉంది.. సీత పాత్ర నాకెంతో స్పెషల్.. అలాంటి పాత్ర మళ్ళీ చేయలేనేమో. సాయి గారితో పనిచేయడం అమేజింగ్ గా ఉంది.. అయన తో పనిచేయడం మర్చిపోలేను… తప్పకుండ అందరు ఈ సినిమా చూడండి’ అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More