మెగాస్టార్ ఫాంటసీ డ్రామాలో కాజల్ ?

మెగాస్టార్ ఫాంటసీ డ్రామాలో కాజల్ ?

Published on Jan 20, 2024 11:37 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్ పై కొత్తగా మరో రూమర్ వినిపిస్తోంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోందట. కానీ, ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐతే, త్రిషనే మెగాస్టార్ సరసన నటిస్తే బాగుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుందని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చాడు. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు