కాజల్ మరో భారీ చిత్రంలో నటించనుందా ?

కాజల్ మరో భారీ చిత్రంలో నటించనుందా ?

Published on Mar 25, 2020 3:08 PM IST

కాజల్ అగర్వాల్ ఒక్కొక్కటిగా పెద్ద సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు. ఇప్పటికే ‘ముంబై సాగా, ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తున్న ఆమె మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’లో కూడా కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళినట్టు టాక్ వినబడుతోంది. ఇలయదళపతి విజయ్ త్వరలో మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’ మొదలుపెట్టనున్నారు.

ఇందులో కథానాయికగా కాజల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘తుపాకి’ లో కూడా హీరోయిన్ కాజలే. అందులో ఆమె పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. అందుకే ఈసారి కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. కాజల్ సైతం మొన్నామధ్య ఇన్స్టా లైవ్ ద్వారా మాట్లాడుతూ విజయ్ తన ఫేవరెట్ కో స్టార్ అని హింట్ కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ రావొచ్చని అనిపిస్తోంది. ఇకపోతే కాజల్, విజయ్ గతంలో ‘మెర్సల్, జిల్లా’ చిత్రాల్లో కూడా కలిసి నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు