ప్రేమకి, పెళ్ళికి సమయందొరకడం లేదు : కాజల్

ప్రేమకి, పెళ్ళికి సమయందొరకడం లేదు : కాజల్

Published on Jan 6, 2015 12:04 AM IST

kajal-agarwal
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదేళ్ళగా విభిన్న పాత్రలు చేస్తూ, దాదాపు అందరి అగ్రతారలతో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. ఈ భామ ఇటీవలే ప్రేమలో పడిందంటూ పెళ్ళి, ఇతర వ్యవహారాల గురించి కూడా ఆలిచిస్తుందని వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలన్నిటిని కాజల్ సున్నితంగా తిరస్కరించింది. మనిషన్నాక ఎవరో ఒకర్ని పెళ్ళిచేసుకోవాల్సిందేగా.. ఒక్కళ్ళమే జీవితాంతం వుండడం సాధ్యంకాదు. అయితే ప్రస్తుతం నాకు ప్రేమ గురించి, పెళ్ళి గురించి ఆలోచించే సమయం లేదు. ఈ ఏడాదంతా సినిమాలలో బిజీగా వుండనున్నాను. త్వరలోనే మీకందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని ముగించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టెంపర్ సినిమాలో నటిస్తుంది.

తాజా వార్తలు