కాజల్ బినామీ వేలకోట్లు

కాజల్ బినామీ వేలకోట్లు

Published on Dec 1, 2011 2:10 PM IST


కంగారు పడకండి, కాజల్ తమిళ్ లో నటించిన ‘మోది విలయాడు’ చిత్రాన్ని తెలుగులో ‘బినామి వేలకోట్లు’ పేరుతో డబ్ చేయనున్నారు. ఈ చిత్రంలో వినయ్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబరు రెండవ వారంలో విడుదల కానుంది. హరిహరన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి చరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర తెలుగు రైట్స్ శ్రీ చక్ర మూవీ మేకర్స్ మరియు సిహెచ్ విఎస్ఎన్ బాబ్జి వారు తీసుకున్నారు.

ఈ చిత్రం తమిళ్ లో భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే వేలకోట్ల బ్లాక్ మనీకి అధిపతి అయిన ఒక పవర్ ఫుల్ డాన్ కుటుంబం అనుకోని పరిస్థులలో ప్రమాదంలో పడుతుంది. ఆ పరిస్థితుల నుండి ఎలా బైట పడ్డారు అనేది మిగతా చిత్ర కథ. కాజల్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు