కాజల్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది

Published on Mar 23, 2020 10:48 am IST


మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మొదటిగా హీరోయిన్ గా త్రిషను అనుకున్నారు. ఐతే దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ మూవీ నుండి బయటికి వెళ్ళిపోతున్నట్లు ఆమె ప్రకటించింది. కాగా కొద్దిరోజులుగా త్రిషా ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారంటూ వార్తలు వస్తుండగా కాజల్ ధృవీకరించింది.

ఓ వీడియో ద్వారా ఆమె ఆచార్య సినిమాలో నటిస్తున్నట్లు చెప్పడం జరిగింది. అలాగే కరోనా వైరస్ కారణంగా ఆచార్య సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది. త్వరలో తిరిగి మొదలుకానుంది ఆమె చెప్పడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :