బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్

బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్

Published on Nov 13, 2014 10:17 AM IST

kajal-aggarwal

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తన షెడ్యూల్ లో కాజల్ కి కాస్త విరామం దొరకడంతో కాజల్ గోవాలో కొంత సమయం ఎంజాయ్ చేసింది. చాలా వరకూ కాజల్ తన సినిమా షూటింగ్స్ పూర్తయ్యాక దగ్గరలో ఉన్న బీచ్ లో తన ఫ్రెండ్స్ లేదా టీం మెంబర్స్ తో రిలాక్స్ అవుతుంది.

అలాగే కాజల్ కి ప్రకృతిని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టం. ఇటీవలేకాజల్ బిజీ షెడ్యూల్ కి కాస్త విరామం ఇచ్చి గోవా బీచ్ లో సేదతీరింది. దానికి సంబందించిన ఫోటోలను కూడా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ గ్లామరస్ బ్యూటీ కృష్ణవంశీ తీసిన ‘గోవిందుడు అందరివాడేలే’తో సక్సెస్ అందుకొని మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చింది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ధనుష్ సరసన తమిళంలో ఓ సినిమా చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు