
సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ మరియు ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో బ్యూటిఫుల్ కాజల్ ఆగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ యంగ్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేస్తోంది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇన్ని రోజులు గోవాలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న కాజల్ ప్రస్తుతం కోలీవుడ్ లో ల్యాండ్ అయ్యింది.
కాజాల అగర్వాల్ సౌత్ ఇండియన్ బ్రూస్లీ అయిన ధనుష్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే చెన్నైలో మొదలైంది. తాజాగా కాజల్ అగర్వాల్ ఈ చిత్ర టీంతో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ధనుష్ – కాజల్ అగర్వాల్ పై షూటింగ్ చేస్తున్నారు. ‘లవ్ ఫెయిల్యూర్’ ఫేం బాలాజీ మోహన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ నటించిన చివరి సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

