వెబ్ సిరీస్ లో చందమామ…?

వెబ్ సిరీస్ లో చందమామ…?

Published on Jul 23, 2019 11:25 AM IST

సాంకేతిక రంగం అభివృద్ధి కారణంగా డిజిటల్ మీడియా,ఎంటర్టైన్మెంట్స్ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగం లో పలు మార్పులు వచ్చాయి. వెబ్ సిరీస్లు, సాంప్రదాయ సినీ పరిశ్రమకు సవాలు విసురుతున్నాయి. నెట్ ఫ్లిక్, అమెజాన్,హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో వేలకోట్ల పెట్టుబడులు పెట్టి చిత్రాలు నిర్మిస్తున్నారు.తక్కువ సమయంలో మెరుగైన పారితోషికం అందటంతో స్టార్స్ సైతం ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి సుముఖత చూపిస్తున్నారు.

తాజాగా బ్యూటీ కాజల్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారని సమాచారం. తమిళ పరిశ్రమకు చెందిన దర్శకుడు వెంకట్ ప్రభుతో హాట్ స్టార్ ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకోగా అందులో కాజల్ నటించనుందట. పది ఎపిసోడ్స్ గా ప్రసారం కానున్న ఈ సిరీస్ సెప్టెంబర్ నుండి చిత్రీకరణ మొదలుకానుంది సమాచారం. ఐతే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు