ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది – కాజల్

ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది – కాజల్

Published on May 19, 2024 11:03 PM IST


గతంలో హీరోయిన్స్ కు పెళ్లి అయింది అంటే.. దాదాపు వారి కెరీర్ క్లోజ్ అయినట్టే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పెళ్లి తర్వాత కూడా కొందరు హీరోయిన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. తన బాబు పుట్టాక ఓ తల్లిగా తన బాబే ప్రపంచంగా బ్రతుకుతున్న కాజల్ లేటెస్ట్ గా వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది.

కాగా తాజాగా కాజల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ తో పోలిస్తే, టాలీవుడ్ లో పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని, దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి అనేది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను పెద్దగా మార్చలేదని కాజల్ చెప్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు