కాజల్ అగర్వాల్ స్టార్డమ్ కి ఇదే కారణం.!

kajal
సౌత్ లోని టాప్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వల్ ఒకరు.. 30 ఏళ్ల ఈ ముంభై భామ పది సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో అగ్రనాయకి గా కొనసాగడానికి గల సీక్రెట్ ఎంటనేదాన్ని బయట పెట్టేసింది. ‘కథానాయికగా కెరీర్ తొలిరోజుల్లో ఎవరు కథ చెప్పినా ఒప్పుకునే దాన్నని, దానివల్ల ఫలితం ఎలా ఉన్నా అనుభవం వచ్చిందని అందువల్లే ఇప్పుడు ఎవరైనా కథ చెప్పినప్పుడు జడ్జ్ చేయగలనన్న నమ్మకం కుదిరిందని’ అన్నారు.

అలాగే ‘ఎవరైనా కథ చెపితే బాగుందా? లేదా? అన్నది ఆలొచించటం మొదలుపెట్టానని అంతే కాకుండా నా పాత్రను మలిచిన విధానం బాగుందా లేదా అన్నది కూడా చూస్తాను. నువ్వు ఈ పాత్రకు న్యాయం చేయగలవు అని నా మనసు నాతో చెప్పినప్పుడే’ నేను ఆ సినిమా చేయడానికి అంగీకరిస్తానని ఈ చందమామ బ్యూటీచెప్పింది.

కాజల్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం లోనూ నటిస్తున్నది. హిందీ లో రణదీప్ హుడా సరసన నటించిన “దొ లఫన్జోంకి కహానీ” రిలీజ్ కి సిద్దమైంది.

Exit mobile version