
గతేడాది ‘ఖైది నెం 150, మెర్సల్, వివేగం’ వంటి భారీ చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది ‘అ, ఎమ్ఎల్ఏ’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం ఈమె హిందీ ‘క్వీన్’ సినిమా తమిళ రీమేక్ లో టైటిల్ రోల్ చేస్తోంది.
ఇది మాత్రమే కాకుండా తెలుగులో రవితేజ చిత్రానికి కూడ సైన్ చేసిమా ఈమె త్వరలో పంజాబీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. అయితే ఆ చిత్ర దర్శకుడు ఎవరు, ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.