కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ కానున్న కాజల్ !

కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ కానున్న కాజల్ !

Published on May 14, 2018 9:39 AM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ శర్వానంద్ 25వ సినిమాలో కథానాయకిగా నటించనున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆ రెండు పాత్రల్లో ఒక పాత్రకు జోడీగా కాజల్, ఇంకో పాత్రకు జంటగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు.

ఇప్పటికే కళ్యాణి ప్రియదర్శన్ షూటింగ్లో పాల్గొంటుండగా కాజల్ కూడ ప్రస్తుతం చేస్తున్న ‘పారిస్ పారిస్’ షూట్ ముగియగానే జూన్ 5వ తేదీ నుండి చిత్రీకరణలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉండబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు