విజయ్ దేవరకొండ తో నటించనున్న స్టార్ హీరోయిన్ ?

Published on Jul 7, 2018 5:56 pm IST

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని’ రోజు ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యువ హీరో విజయ్ దేవరకొండ ఒక చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో విజయ్ కు జోడిగా సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తను ఇంకా అధికారికంగా ద్రువీకరించ లేదు .

ఇక వరుస సినిమాల్తో బిజీ అవుతున్న దేవరకొండకి క్రాంతి చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ పతాకం ఫై కె ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ 10 నుండి యూరప్ లో ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :