“మోసగాళ్లు”లో ఫస్ట్ ఛాయిస్ కాజల్ కాదు.!

Published on Mar 18, 2021 9:00 am IST

ఈ వారాంతం విడుదలకు రెడీగా ఉన్న చిత్రాల్లో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “మోసగాళ్లు”. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కంటెంట్ పైనే విష్ణు బాగా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కు ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ విష్ణుకు చెల్లెలి పాత్రలో నటించింది. కానీ ఆమె రోల్ కు మొదటగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతీ జింటా ను అనుకున్నామని అలా అప్పుడు ఆమెను అప్రోచ్ కాగా తాను కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఈ సినిమా చెయ్యాలనుకోడం లేదని చెప్పారని తెలిపాడు. దానితో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఆ రోల్ కు బాగుంటుంది అని అనుకోని కాజల్ ను తీసుకున్నట్టుగా తెలిపాడు. మరి ఈ చిత్రంలో కాజల్ రోల్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపు మార్చ్ 19 వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :