కాజల్ ‘సత్యభామ’ రిలీజ్ డేట్ ఫిక్స్

కాజల్ ‘సత్యభామ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Apr 22, 2024 5:01 PM IST

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ. కాజల్ కెరీర్ 60వ మూవీగా వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్‌ గ్లింప్స్ వీడియో అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ క్రైం థ్రిల్లర్‌ జానర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండగా శ్రీనివాసరావు తక్కలపెల్లి, బాబీ టిక్కా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా సత్యభామ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌.

ఇక విడుదల తేదీని స్టైలిష్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ద్వారా మే 17 గా ప్రకటించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్‌ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌ సత్యభామగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్‌, టీజర్‌తో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్‌. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ మూవీకి విష్ణు బేసి ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం సత్యభామ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు