కిషోర్ దాస్.. ‘కలియుగ పరమానందయ్య’

Kaliyuga-Paramanandayya-fil
ప్రముఖ టీవీ వ్యాఖ్యాత కిషోర్ దాస్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ఓ సినిమాను ఈ ఉదయం ప్రకటించారు. గతంలో ఎన్టీఆర్ హీరోగా, చిత్తూర్ నాగయ్య పరమానందయ్య పాత్రలో నటించగా రూపొంది ఘనవిజయం సాధించిన చిత్రం ‘పరమానందయ్య శిష్యుల కథ’ విడుదలై నేటికి యాభై సంవత్సరాలైన సందర్భంగా ‘కలియుగ పరమానందయ్య’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు.

ఇందులో కిషోర్ దాస్ పరమానందయ్యగా నటిస్తుండగా, శిష్యులుగా వినోద్, నాయుడు, దుర్గాజీ, కార్తీక్, తాజ్ హుద్దీన్, అరవింద్, మోహన్, అదిత్యలు నటిస్తున్నారు. వి.యు.ఎం. రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రెండు నెలల్లో షూటింగ్ మొదలు పెట్టి వినాయకచవితికి సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత ఎన్.వి.బి. చౌదరి, వై.కె. నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.