ప్రస్తుతం ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) లు కీలక పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
అయితే ఈ చిత్రం విషయంలో ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ గారి వారసురాలు అలాగే యువ నిర్మాత అయినటువంటి స్వప్న దత్ ఇన్స్టా స్టోరీ వైరల్ గా మారింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తో మాట్లాడుతున్నట్టుగా ఫన్ కన్వర్జేషన్ ని తెలిపారు. సీజీ కి వర్క్ చేస్తున్న వారు అంతా హైదరాబాద్ నుంచి ఎలెక్షన్స్ కి వెళ్లిపోయారు అని దర్శకుడు అంటే స్వప్న దత్ ఎన్నికల విషయమై ఎవరు గెలుస్తారు అని అడిగారు.
దీనికి ఎవరు గెలిస్తే నాకెందుకండి నా షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాలి కానీ అంటూ బదులిచ్చాడు. ఇది మాత్రం మంచి ఫన్ గా ఉందని చెప్పాలి. ఇక దీనితో ఈ భారీ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఈ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.