‘కల్కి 2898 ఏడి’ : రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్ డేట్

‘కల్కి 2898 ఏడి’ : రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Apr 16, 2024 3:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీకి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వినిదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చిన కల్కి మూవీని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

అయితే కొంత మేర విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలన్స్ ఉన్న కారణంగా మూవీని రెండు నెలల పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని, అలానే జులై 12న మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరోవైపు జూన్ తరువాత ఎన్నికల హడావుడి పూర్తి కావడంతో మేకర్స్ జులై 12 న రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపోతున్నారని, అతి త్వరలో దీని పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు