ఓవర్సీస్ లో “కల్కి” మ్యానియా.. హాట్ కేకుల్లా బుకింగ్

ఓవర్సీస్ లో “కల్కి” మ్యానియా.. హాట్ కేకుల్లా బుకింగ్

Published on May 30, 2024 9:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) అలాగే అమితాబ్ లాంటి దిగ్గజాలతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి సాలిడ్ సై ఫై మరియు ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రంని ఓవర్సీస్ మార్కెట్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా ఇప్పుడిప్పుడే యూఎస్ మార్కెట్ లో అలా బుకింగ్స్ (Kalki 2898 AD Bookings) ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇలా అయ్యిన కొన్ని లొకేషన్స్ లో కూడా యిట్టె టికెట్స్ బుక్ అయ్యిపోతున్నాయి.

దీనితో ప్రభాస్ మరోసారి సలార్ తర్వాత తన స్టార్డం ఓ రేంజ్ లో చూపిస్తున్నాడు అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ లో కల్కి బుకింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాని ఇండియా లోనే కాస్ట్లీ సినిమాగా రూపొందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు