‘కల్కి 2898 ఏడి’ : రిలీజ్ డేట్ లాక్ ?

‘కల్కి 2898 ఏడి’ : రిలీజ్ డేట్ లాక్ ?

Published on Apr 27, 2024 3:00 AM IST

Kalki 2898 AD

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని నాగ అశ్విన్ తెరకెక్కిస్తుండగా గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ నుండి రేపు సాయంత్రం బిగ్ అనౌన్స్ మెంట్ ఉందని నిన్న సాయంత్రం మేకర్స్ ప్రకటించారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లాక్ అయిందని తెలుస్తోంది. కాగా కల్కి 2898 ఏడి ని జూన్ 27న ఆడియన్స్ ముందుకి గ్రాండ్ లెవెల్లో తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ చేశారట. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు