‘కల్కి 2898 ఏడి’ రిలీజ్ ఆ నెలలోనే ఫిక్స్ అట….కానీ ?

‘కల్కి 2898 ఏడి’ రిలీజ్ ఆ నెలలోనే ఫిక్స్ అట….కానీ ?

Published on Apr 24, 2024 11:00 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీస్ లో ఒకటైన భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుండి తాజాగా రిలీజ్ అయిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా అత్యంత భారీ వ్యయంతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

విషయం ఏమిటంటే, వాస్తవానికి వేసవి కానుకగా మే 9న రిలీజ్ కావాల్సిన కల్కి మూవీ వాయిదా పడనుందనేది తెలిసిందే. ఇక ఈమూవీని మే నెలాఖరు లేదా జూన్ లో రిలీజ్ చేస్తారనే న్యూస్ కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం కల్కి 2898 ఏడి మూవీ పక్కాగా జూన్ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదని, మే మొదటి వారంలో మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు