వినూత్నంగా “కల్కి 2898 ఎడి” హిట్ ప్రమోషన్స్

వినూత్నంగా “కల్కి 2898 ఎడి” హిట్ ప్రమోషన్స్

Published on May 1, 2024 7:03 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకోణ్ (Deepika Padukone) అలాగే దిశా పటాని (Disha Patani) ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఎప్పుడు నుంచో ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ ప్రమోషన్స్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేసాడు అంతే కాకుండా ఈ ఏడాదిలోనే ముందు రిలీజ్ డేట్ ప్రణాళికల్లో ఆఫ్ లైన్ లో ఓ రేంజ్ ప్రమోషన్స్ ని ఇండియా వైడ్ గా చేసాడు.

అయితే ఇప్పుడు మరోసారి మేకర్స్ తమ వినూత్న ప్రమోషన్స్ ని ప్రదర్శిస్తున్నారు. రీసెంట్ గానే అమితాబ్ పై ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని వారు రిలీజ్ స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేయగా దీనికి ఐపీఎల్ టైం లో ఇండియా వైడ్ గా సాలిడ్ రీచ్ వచ్చింది. ఇక నిన్న రాత్రి ప్రభాస్ తో ఇంట్రెస్టింగ్ వీడియో ప్లాన్ చేశారు.

దీనితో కల్కి కోసం దేశం అంతా మాట్లాడ్డం స్టార్ట్ చేసింది. దీనితో మేకర్స్ చేసిన ఈ ప్లాన్ మాత్రం ఒక స్యూర్ షాట్ హిట్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఇదే విధంగా కానీ రిలీజ్ వరకు ప్రమోషన్స్ కొనసాగితే మాత్రం భారీ ఓపెనింగ్స్ దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు