“కల్కి 2898ఎడి” అంతిమ చర్చలు..!

“కల్కి 2898ఎడి” అంతిమ చర్చలు..!

Published on Apr 18, 2024 7:03 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898ఎడి”. మరి ఎన్నో అంచనాలు నడుమ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అంతకంతకూ సస్పెన్స్ గా మారింది. మే 9 రిలీజ్ అయినప్పటికీ ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ లేవు అలాగని వాయిదా వేసినట్లు అధిలారికంగా ప్రకటన కూడా చెయ్యలేదు.

దీనితో కొత్త డేట్ కోసం అంతా ఆసక్తి గా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా దీనిపై క్లారిటీ వినిపిస్తోంది. మేకర్స్ ఇవాళ అయితే అంతిమ చర్చలు జరుపనున్నారట. ఈరోజు చర్చతో కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది లాక్ చేస్తారని దానిని అనౌన్స్ చేస్తారని వినిపిస్తోంది. మరి చూడాలి ఏ డేట్ లో కల్కి వస్తుంది అనేది. ఇక ఈ భారీ సినిమాలో దీపికా, దిశా పటాని లు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు