ఏపీలో కూడా “కల్కి 2898ఎడి” రికార్డు బిజినెస్!?

ఏపీలో కూడా “కల్కి 2898ఎడి” రికార్డు బిజినెస్!?

Published on Apr 16, 2024 10:03 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని సహా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ లాంటి దిగ్గజ స్టార్లు నటిస్తున్న సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898ఎడి” (Prabhas Kalki 2898AD). దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా ఇది కాగా ఈ చిత్రం కోసం ప్రపంచమే ఎదురు చూస్తుంది.

అయితే ఈ చిత్రం తాలూకా బిజినెస్ సంబంధించి ఓ రేంజ్ లో జరుగుతున్నట్టుగా వినిపిస్తుంది. ఆల్రెడీ జస్ట్ ఓటిటి హక్కులే 300 కోట్లకి పైగా వచ్చేయగా థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది అని వినిపిస్తుంది. ఆల్రెడీ నైజాంలోనే 100 కోట్లకి పైగా ఆఫర్ ని ఈ చిత్రం అందుకున్నట్టుగా టాక్ ఉంది.

ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా రికార్డు బిజినెస్ ని ఈ చిత్రం లాక్ చేసినట్టుగా వినిపిస్తుంది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఏపీ మొత్తంగా కూడా 100 కోట్లకి పైగా బిజినెస్ ని ఈ సినిమా జరుపుకున్నట్టుగా వినిపిస్తుంది. దీనితో కేవలం ఏపీ, తెలంగాణలోనే ఏకంగా 200 కోట్లకి పైగా బిజినెస్ ని జరుపుకుంది అని చెప్పాలి. ఇక ముందు ముందు ఈ చిత్రం ఏ రేంజ్ బిజినెస్ ని జరుపుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు