ప్రభాస్ “కల్కి” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి సన్నాహాలు…మ్యూజిక్ రైట్స్ డీటైల్స్ ఇవే!

ప్రభాస్ “కల్కి” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి సన్నాహాలు…మ్యూజిక్ రైట్స్ డీటైల్స్ ఇవే!

Published on May 16, 2024 4:15 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మైథాలాజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898 ఏ. డి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం ను జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం కి సంబందించిన మ్యూజిక్ రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ అయిన సరిగమ సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ఈ నెలాఖరు లో రిలీజ్ కానుంది. దీనిపై మేకర్స్ నుండి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు