జస్ట్ ఓటిటి హక్కులు తోనే సగం బడ్జెట్ రాబట్టేసిన ప్రభాస్ క్రేజ్..


గత కొన్నేళ్ల నుంచి ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా భాషల్లో భారీ మార్కెట్ ఉన్న ఏకైక హీరోగా అయితే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొనసాగుతున్నాడు. బాహుబలి 1,2 తర్వాత సరైన హిట్ లేకపోయినప్పటికీ “సలార్” (Salaar) సినిమాతో హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో చూపించాడు.

అంతే కాకుండా ఎలాంటి జానర్ కి అయినా కూడా తాను ఫస్ట్ ఛాయిస్ లా తాను తప్ప మరో హీరో ఆ పాత్రని మోయలేడు అనే రేంజ్ లో తన ఛరిష్మాని మార్చుకోగా అలా తాను తప్ప ఇంకో హీరో చేయలేడు అనే రేంజ్ లో చేస్తున్న మరో సినిమానే “కల్కి 2898ఎడి” (Kalki 2898 AD).

దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియా సినిమా హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సుమారుగా 600 కోట్లకి పైగా బడ్జెట్ పెడుతున్నారని టాక్ ఉంది. మరి ఇందులో సగానికి పైగా బడ్జెట్ ని కేవలం ఓటిటి హక్కులతోనే రాబట్టేసినట్టుగా ఇప్పుడు టాక్.

హిందీ సహా సౌత్ భాషలు హక్కులు ఈ సినిమావి రికార్డు ధరకి అమ్ముడుపోయినట్టుగా బజ్ ఉంది. కేవలం ఈ రెండు మాత్రమే 300 కోట్లకి పైగానే దాటేశాయి. దీనితో ప్రభాస్ ప్రెజెన్స్ కి ఏ రేంజ్ మార్కెట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని అసలే వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.

ఇక థియేట్రికల్ బిజినెస్ ఏ లెవెల్లో ఉంటుందో అన్నీ సెట్ అయ్యి సరైన టాక్ పడితే మాత్రం గతంలో సలార్ కి మిస్ అయ్యిన 1000 కోట్ల గ్రాస్ మార్క్ ఖచ్చితంగా ఈ చిత్రానికి వచ్చి పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎలాంటి వండర్స్ సెట్ చేస్తుందో చూడాలి.

ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు అత్యంత కీలక పాత్రలు చేస్తున్నారు.

Exit mobile version