“కల్కి” ఎవరూ ఊహించలేని విధంగా ఉంటుంది

“కల్కి” ఎవరూ ఊహించలేని విధంగా ఉంటుంది

Published on May 4, 2024 3:01 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి (Kalki 2898AD). ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై మరింత హైప్ క్రియట్ కావడానికి ప్రచార చిత్రాలు దోహదం అయ్యాయి.

ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే దానిపై మై డియర్ దొంగ డైరెక్టర్ బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి అనేది ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని చాలా డిఫెరెంట్ కాన్సెప్ట్ మరియు ప్రతి ఒక్కరూ ఊహించలేని విధంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. కల్కి చిత్రానికి ఈ డైరెక్టర్ అడిషనల్ రైటర్ గా పని చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు