యూరప్ లో ఊహించని రేంజ్ లో “కల్కి” రిలీజ్!

యూరప్ లో ఊహించని రేంజ్ లో “కల్కి” రిలీజ్!

Published on May 30, 2024 12:28 AM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ చిత్రం ను యూరప్ లో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 40 దేశాలకు పైగా ఈ చిత్రం ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రత్యంగిర సినిమాస్, ది విలేజ్ గ్రూప్ తో సినిమాను రిలీజ్ చేయనుంది.

ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. కల్కి చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు కథానాయికలు గా నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు