ఈ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కానున్న ప్రభాస్ “కల్కి”

ఈ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కానున్న ప్రభాస్ “కల్కి”

Published on May 30, 2024 6:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం భారతీయ ప్రధాన భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కి రెడీ అయిపోయింది. తాజాగా బుజ్జి మరియు భైరవ యానిమేటెడ్ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సిరీస్ స్పానిష్ లో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం ను యూరప్ లో కూడా భారీగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. స్పానిష్ లో కూడా సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు