కమెడియన్ కళ్ళు చిదంబరం ఇకలేరు.!

kallu-chidabaram

రంగ స్థలం మీద ఎన్నో నాటకాలను వేసి ఆ తర్వాత అటు నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు కళ్ళు చిదంబరం. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్ను మూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన ఒక వారం రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం అక్కడే ఆయన తన తుదిశ్వాసని విడిచారు. ఈ వార్త కళ్ళు చిదంబరం కుటుంబసభ్యులను శోఖ సంద్రంలో ముంచింది.

సుమారు 70 ఏళ్ళ వయసుకలిగిన కళ్ళు చిదంబరం విశాఖలోని అక్కయ్యపాలెంలో జన్మించారు. నాటకరంగంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్న ఈయన 1989లో వచ్చిన ‘కళ్ళు’ అనే సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత అదే సినిమాని తన ఇంటిపేరుగా మార్చుకొని పలు సూపర్ హిట్ సినిమాల్లో తనదైన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించాడు. కొండవీటి దొంగ, చంటి, మనీ, గోవిందా గోవిందా, అమ్మోరు, మృగరాజు, శ్వేత నాగు మొదలైన సినిమాలలో ఆయన నటించారు.

123తెలుగు.కామ్ తరపున కళ్ళు చిదంబరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం.

Exit mobile version