‘118’ కోసం కళ్యాణ్ రామ్ సీరియస్ ట్రైయినింగ్ !

‘118’ కోసం కళ్యాణ్ రామ్ సీరియస్ ట్రైయినింగ్ !

Published on Dec 8, 2018 11:15 PM IST

Kalyan Ram
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘118’ అనే టైటిల్ తో తన 16వ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ డైరక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్ అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం తరువాత జరగబోయే షెడ్యూల్ తో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కానుంది. అయితే ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఒక క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ఉందట. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అండర్ వాటర్ లో ఆ సీక్వెన్స్ లో నటించడానికి ట్రైయినింగ్ తీసుకుంటున్నారట.

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు