లేటెస్ట్…కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్!

లేటెస్ట్…కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్!

Published on May 27, 2024 9:00 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ చివరిసారిగా డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. తదుపరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న NKR21 చిత్రానికి ప్రదీప్ చిలుకూరి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ ను రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 07:59 గంటలకు ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో ప్రొడక్షన్ నంబర్ 2 గా, అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై అశోక్ వర్ధన్ ముప్ప మరియు సునీల్ బలుసు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు