
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పటాస్’. ఈ చిత్రాన్ని జనవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని యూనిట్ వర్గాల నుండి అందిన సమాచారం. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో స్వరాలు, నందమూరి అభిమానులతో పాటు.. శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.
సంక్రాంతి బరిలో ‘గోపాల గోపాల’, శంకర్ ‘ఐ’ చిత్రాలు విడుదలవుతున్నాయి. అందువల్ల ‘పటాస్’ చిత్రాన్ని జనవరి మూడవ వారంలో విడుదల చేయాలనీ నిర్ణయించారట. ‘పటాస్’ నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సరైన విడుదల తేదీ కోసం చిత్ర బృందం ఎదురుచూస్తుంది.
అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శృతి సోది హీరోయిన్. తెలుగులో ఆమెకిదే తొలి చిత్రం. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

