నెంబర్ 1 ప్లేస్ ట్రెండింగ్ లో “బింబిసార”.!

Published on May 29, 2021 2:00 pm IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా ఇప్పటి వరకు టచ్ చెయ్యని సాలిడ్ కాన్సెప్ట్ తో అనౌన్స్ చేసిన లేటెస్ట్ చిత్రం “బింబిసార”. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ మైథలాజికల్ డ్రామాను దర్శకుడు వశిష్ట్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ సినిమా దగ్గర పైగా మన తెలుగులో అతి తక్కువ టచ్ చేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను హిస్టారికల్ షేడ్ ను జోడించి ఇచ్చిన ఈ సర్ప్రైజ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే టైటిల్ అనౌన్సమెంట్ ఇచ్చిన వీడియో ఇపుడు భారీ రెస్పాన్స్ తో యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో 1.5మిలియన్ కి పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతూ నిలిచింది. మొత్తానికి మాత్రం కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన ఈ ఊహించని సర్ప్రైజ్ కి మంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. మరి ఈ చిత్రంలో క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్స్ నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తన్నారు. 

సంబంధిత సమాచారం :