కళ్యాణ్ రామ్ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఆరంభం..

కళ్యాణ్ రామ్ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఆరంభం..

Published on May 28, 2024 9:51 AM IST

ఆసక్తికర చిత్రాలతో అలరిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోస్ లో నందమూరి వారి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. బింబిసార, అమిగోస్ లాంటి ఆసక్తికర నేపథ్యం ఉన్న చిత్రాలు చేస్తూ కొత్త కొత్త సబ్జెక్ లతో వస్తున్నా కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న సరికొత్త ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ ని ఇప్పుడు తాను అందించాడు.

దివంగత, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా తాలూకా అనౌన్సమెంట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ ఒక సరికొత్త మేకోవర్ లో ఉండనున్నట్టుగా కనిపిస్తున్నాడు.

అలాగే వీడియో టైటిల్ కి తగ్గట్టుగా రుద్రాక్షలతో కూడిన పిడికిలితో ఇది సాలిడ్ యాక్షన్ సబ్జెక్టు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా అలాగే సునీల్ బలుసు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే కాంతార, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే షూటింగ్ దశలో ఈ చిత్రం ఇపుడు ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు