భారీ చిత్రాన్ని సైలెంట్ గా చాలానే కంప్లీట్ చేసేసిన కళ్యాణ్.!

Published on Jul 1, 2021 1:35 pm IST

మన టాలీవుడ్ నుంచి వచ్చే ఫాంటసీ చిత్రాలకు కూడా స్పెషల్ క్రేజ్ ఉంది. వాటికి హిస్టారికల్ టచ్ ను యాడ్ చేసి సెన్సేషన్ ను నమోదు చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అలా నందమూరి కళ్యాణ్ రామ్ సైలెంట్ గా బ్లాస్టింగ్ అనౌన్సమెంట్ ఇచ్చేసిన లేటెస్ట్ చిత్రం “బింబిసారా”.

భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ హిస్టారికల్ చిత్రంగా దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తున్నాడు. కేవలం ఒక హిస్టారికల్ సినిమాగానే కాకుండా అందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని కూడా యాడ్ చెయ్యడంతో ఈ జానర్ పై మరింత ఆసక్తి పెరిగింది. అయితే సడెన్ ట్విస్ట్ గా ఇచ్చిన ఈ సినిమా అనౌన్సమెంట్ నాటికే చాలా మేర సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యినట్టు తెలిసింది.

మరి ఇప్పుడు టాక్ ప్రకారం అయితే ఏకంగా 70 శాతం మేర షూట్ ను కళ్యాణ్ రామ్ కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా కళ్యాణ్ రామ్ నే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :