కళ్యాణ్ రామ్ లుక్ మారింది, లక్కే మారాలి !

కళ్యాణ్ రామ్ లుక్ మారింది, లక్కే మారాలి !

Published on Jun 16, 2018 12:00 PM IST

Kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ ‘మహానటుడు ఎన్టీఆర్’ మనవడిగా 2003లో తన సినీ కెరీర్ ను మొదలు పెట్టినా, పటాస్ నుంచి కళ్యాణ్ రామ్ తన నటనను, బాడీ లాంగ్వేజీని మార్చుకుంటూ వస్తున్నారు. ఇజం సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశారు. ఫిట్ నెస్ తో పాటు, డైలాగ్ మాడ్యులేషన్ లో యాక్టింగ్ లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. కళ్యాణ్ రామ్ ఎంతోకష్టపడి ఇంతగా తనను తాను మార్చుకుంటున్న ఆయన సినిమాలు మాత్రం భారీ విజయాన్ని సాధించలేకపోతున్నాయి. ఒకప్పుడు కథలు బాగున్నా ఆ పాత్రలు ఆయనకు నప్పేవి కావు, ఇప్పుడు ఆయన, పాత్రలకు తగ్గట్టు మారుతున్న కథలు సరైనవి పడట్లేదు.

ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలయిన ‘నా నువ్వే’ చిత్రం కూడా భారీ విజయం దిశగా వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. సమ్మోహనం చిత్రం పాజిటివ్ టాక్ రావటం ఇప్పుడు కాళ్యాణ్ రామ్ సినిమా పై ప్రభావం చూపేలా ఉంది. ‘నా నువ్వే’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నేలా లేకపోవడం కూడా సమ్మోహనం చిత్రానికి కలిసొచ్చేలా ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ పవన్ సాధినేని దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఆ సినిమాతోనైనా కళ్యాణ్ రామ్ భారీ విజయాన్ని సాధిస్తాడని ఆశిద్దాం.

తాజా వార్తలు