ఇటీవలే ‘ఎం.ఎల్.ఏ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ త్వరలో ఇంకో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాను ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె. వి.గుహన్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ మధ్య ప్రతి సినిమాకు లుక్స్ పరంగా వేరియేషన్ చూపిస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కూడ కొత్తగా కనిపించనున్నారు.
కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా కోసం ఆయన చేసుకున్న కొత్త మెకోవర్ బయటకొచ్చింది. ఇందులో కళ్యాణ్ రామ్ కొద్దిగా రఫ్ లుక్లో మ్యాన్లీగా కనిపిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేత థామస్, షాలిని పాండేలు నటించనున్నారు.
మే 2వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇకపోతే తమన్నా జోడీగా ఆయన చేసిన తాజా చిత్రం ‘నా నువ్వే’ మే 25న విడుదలకానుంది.
