‘సూపర్ మచ్చి’ అంటున్న చిరంజీవి అల్లుడు

‘సూపర్ మచ్చి’ అంటున్న చిరంజీవి అల్లుడు

Published on Oct 26, 2019 11:40 AM IST

super

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గత ఏడాది విజేత చిత్రంతో వెండి తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా వచ్చిన ఆ చిత్రం ఆయనకి విజయం చేకూర్చకపోయినా, హీరోగా మంచి మార్కులే పడ్డాయి. ఆ చిత్రం విడుదలైన ఏడాదిన్నర తరువాత కళ్యాణ్ దేవ్ నేడు కొత్త చిత్రానికి సంబందించిన అప్డేట్ ఇచ్చారు. సూపర్ మచ్చి టైటిల్ తో ఆయన ఓ మూవీ చేస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

దీపావళిని పురస్కరించుకొని వదిలిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కళ్యాణ్ దేవ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. దర్శకుడు పులి వాసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తుండగా, యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ కి జంటగా రియా చక్రవర్తి నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు