సంక్రాంతి బరిలోనే నందమూరి హీరో

Published on Sep 21, 2019 9:34 pm IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సంక్రాంతి పోటీలో దిగుతున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా నేడు పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లుఅర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలతో పాటు రజిని కాంత్ దర్బార్ మూవీ సంక్రాంతికి రానున్నట్లు ప్రకటించేశాయి. కళ్యాణ్ రామ్ కూడా గతంలోనే సంక్రాంతికి రానున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ నేడు అధికారికంగా స్పష్టం చేశారు.

‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘ఎంతమంచివాడవురా’. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన కల్యాణ్ రామ్ `సంక్రాంతికి థియేటర్లలో కలుస్తాన`ని ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :

X
More