గౌతమితో విడిపోవడం గురించి కమల్ ఏమన్నారంటే..!

kamal-hassan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, గౌతమిల జంటను సౌతిండియాలోని స్టార్ కపుల్స్‌లో ఒకరుగా ప్రస్తావిస్తూ ఉంటారు. గత 13 ఏళ్ళుగా కలిసి సహజీవనం చేస్తూ వస్తోన్న ఈ ఇద్దరూ, తాజాగా తమ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. కమల్‌వి, తనవి ఇప్పుడు ఆలోచనలు, పరిస్థితులు మారిపోయాయని చెబుతూ గౌతమి ఆయనతో విడిపోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ జంట ఇలా విడిపోయిందో లేదో వీరు వీడిపోవడానికి కారణం ఏమై ఉంటుందని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి.

దీనికితోడుగా కమల్ హాసన్ విడుదల చేసిన ప్రకటనంటూ ఒకటి బయట ప్రచారంలోకి వచ్చి పడింది. అందులో ఆయన గౌతమితో విడిపోవడం గురించి మాట్లాడినట్లు ఉంది. ఇక కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తను ఏ ప్రకటనా ఇవ్వదలచుకోలేదని, తన పేరుని తప్పుగా వాడుతూ ఎవరో ప్రకటన విడుదల చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తన పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావిస్తూ దానిగురించి ఏమీ మాట్లాడకూడదనే కమల్ ఫిక్స్ అయ్యారట.

Exit mobile version