
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగానే కాకుండా తన సినిమాలకు కథ – కథనాలను కూడా అందిస్తుంటాడు. అలా కమల్ హాసన్ కథ – కథనం అందించి తన అసిస్టెంట్ రాజేష్.ఎమ్. సెల్వ దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘చీకటి రాజ్యం’. తమిళంలో ‘తూంగావనం’ అనే టైటిల్ పెట్టారు. ఒకే ఒక్క రోజు రాత్రి ఏం జరిగింది అనే అంశం చుట్టూ తిరిగే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. కేవలం 40 రోజుల్లోనే కమల్ హాసన్ అండ్ టీం ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం కమల్ హాసన్ తన పార్ట్ కి సంబందించిన డబ్బంగ్ వర్క్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఉత్తమ విలన్ తర్వాత కమల్ హాసన్ స్వయంగా తన పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పుకోనున్నాడు. గత రెండు రోజులుగా కమల్ హాసన్ శబ్దాలయా స్టూడియోస్ లో జరుగుతోంది. దీనితో పాటు మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఒక రెస్టారెంట్లోని కిచెన్లో త్రిష, కమల్ల మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో త్వరలోనే జరగనుందని, రిలీజ్ కూడా అతి త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది.