‘మండాడి’ చిత్ర బృందాన్ని అభినందించిన కమల్ హాసన్

‘మండాడి’ చిత్ర బృందాన్ని అభినందించిన కమల్ హాసన్

Published on Sep 23, 2026 8:00 AM IST

‘మండాడి’ చిత్ర బృందాన్ని నటుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా కలిసి అభినందించారు. చిత్ర దర్శకుడు మతిమారన్ పుగళేంది, నిర్మాత ఎల్రెడ్ కుమార్, నటులు సూరి, సుహాస్, రవీంద్ర విజయ్‌లతో మాట్లాడిన ఆయన చిత్ర విజయంపై ప్రశంసలు తెలియజేశారు.

​కమల్ హాసన్‌ను కలవడం పట్ల నటుడు సూరి స్పందిస్తూ, ఆయన తమ టీమ్‌పై చూపిన ప్రేమ, అందించిన ఆశీస్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఈ చిత్ర విజయానికి సంబంధించి ఇప్పటికే రజినీకాంత్ కూడా చిత్ర బృందాన్ని అభినందించారు.

​ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు