
తమిళంతో పాటు సమానంగా తెలుగులో కమల్ హాసన్ కు అభిమానులు ఉన్నారు. విశ్వనాధ్, సింగీతం శ్రీనివాస రావుల దర్శకత్వంలో కమల్ పలు సినిమాలు చేశారు. ఇటివల కాలంలో కమల్ స్ట్రెయిట్ సినిమా చేయలేదు. త్వరలో ఓ లోటు తీరుస్తానని అంటున్నారు.
కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ ఈ మాట చెప్పారు. ‘విశ్వరూపం 2’, ‘పాప నాశనం’, ‘ఉత్తమ విలన్’ సినిమాలు పూర్తి కాగానే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తానని ప్రకటించారు. దర్శకుడు ఎవరనేది చెప్పలేదు.
గతంలో తెలుగు దర్శకులు శంకర్, తేజలు కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కమల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పలువురు దర్శకులు, నిర్మాతలు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో..?