
తమిళ స్టార్ హీరో సూర్య, అందాల భామ సమంత హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా ‘అంజాన్’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని జూలై 5న రిలీజ్ చేసారు. కేవలం 5 రోజుల్లోనే 17 లక్షల మందికిపైగా ఈ టీజర్ ని యు ట్యూబ్ లో చూసారు. టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమా ఆడియో పైనే ఉంది.
ఈ మూవీ ఆడియో రిలీజ్ కి కూడా ఓ ప్రత్యేకత సంతరించుకుంది. జూలై 22న భారీ ఎత్తున జరగనున్న ఈ మూవీ ఆడియో రిలీజ్ కి ఉలగనాయగన్ కమల్ హాసన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. సూర్య సినిమా ఆడియోని కమల్ హాసన్ రిలీజ్ చేస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు కూడా భారీగా తరలి వస్తారని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సినిమాని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా – శ్రీధర్ లు ‘సికందర్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకి అందించనున్నారు. జూలై 22న తమిళంలో ఆడియో విడుదలవుతుండగా జూలై 31న తెలుగులో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు. ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

