
ఉలగనాయగన్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా గతవారమే తమిళంలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకులు కూడా స్పీడున్న థ్రిల్లర్ అని కితాబులిచ్చారు. ఈ సినిమా ఈ వారం అనగా, నవంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కమల్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన సినిమా కావడం వలన కమల్ హాసన్ ఈ సినిమాని స్పెషల్ గా ఇండస్ట్రీలోని వారికి చూపించడానికి సిద్దమయ్యాడు.
అందుకోసమే రేపు సాయంత్రం ఓ స్పెషల్ ప్రీమియర్ షోని ప్లాన్ చేసాడు. ఈ ప్రీమియర్ షోకి పలువురు ప్రముఖులతో పాటు దగ్గుబాటి హీరోస్ అయిన వెంకటేష్ మరియు రానాలను స్పెషల్ గెస్ట్ లుగా ఆహ్వానించాడు. ప్రస్తుతం ఈ ప్రీమియర్ షో కోసం లొకేషన్ ని ఫిక్స్ చేసే పనిలో కమల్ టీం ఉంది. కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి రాజేష్ ఎం.సెల్వ డైరెక్టర్. ఫ్రెంఛ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ ని స్పూర్తిగా తీసుకొని తీసిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.

