తన మిస్టేక్ వల్ల ఇప్పుడు విచారిస్తున్న కమల్ హాసన్

kamal-haasan

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇటీవలే ఉత్తమ విలన్ సినిమాతో సౌత్ ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఆయన తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూట్ చేయనున్న యాక్షన్ థ్రిల్లర్ కి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాకి తమిళంలో తూంగావనం అనే టైటిల్ ని పెట్టారు. ఇది కాకుండా కమల్ తమిళంలో నటించిన ‘పాపనాశం’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఇది కాకుండా విశ్వరూపం 2 సినిమా పలు ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ విశ్వరూపం 2 సినిమా రైట్స్ ని బయటి డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చేయడం అనే విషయంపై ఇప్పుడు విచారిస్తున్నాను. విశ్వరూపం రిలీజ్ టైం లో జరిగిన కొన్ని ఇబ్బందుల వలన ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. విశ్వరూపం 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఆస్కార్ రవిచంద్రన్ తీసుకున్నారు. కానీ ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఐ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో నష్టాలను చవి చూసాడు. దాంతో ఇప్పుడు విశ్వరూపం 2 సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నారు.

Exit mobile version