కమల్, పూజా కుమార్ల మధ్య లిప్ లాక్??

కమల్, పూజా కుమార్ల మధ్య లిప్ లాక్??

Published on Mar 11, 2013 7:52 PM IST

Kamal-hasan-pooja

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చాలా ఆనందంగా ఉన్నాడు. తమిళనాడులో ‘విశ్వరూపం’ విడుదల కొరకు భావోద్వేగ పోరాటం తరువాత ఒక మంచి ప్రయోగానికి గానూ అతనికి దేశవ్యాప్తంగా వచ్చిన మద్దతు వలన ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు కమల్ ‘విశ్వరూపం2’ తో బిజీగా ఉన్నాడు.

ఇదివరకు చెప్పినట్టే ఈ సీక్వెల్ లో చాలా సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించారు. ఇంకా కొన్ని ముఖ్యమైన సీన్లు మాత్రమే మిగిలివున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో కొన్ని హాట్ సీన్స్ ఉన్నాయని అందులో కమల్, పూజా కుమార్ మధ్య వచ్చే లిప్ కిస్ ఒకటని అంటున్నారు.

ఇప్పటికే ‘విశ్వరూపం2’పై బ్రహ్మాండమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇలాంటి హాట్ సీన్స్ వార్తలు చిత్రంపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు